కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. రష్మికతో కలిసి మాల్దీవుల వెకేషన్ కి వెళ్లి హెడ్ లైన్స్ కి ఎక్కాడు. ప్రస్తుతం కాశ్మీర్ కు వెళ్లిన విజయ్, ఉరి ఆర్మీ బేస్ క్యాంప్ ను సందర్శించాడు. సైనికులతో కలిసి సందడి చేశాడు. గన్ షూటింగ్ సహా పలు విషయాల గురించి తెలుసుకున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి గన్ ఫైరింగ్ చేస్తూ కనిపించాడు. ఆర్మీ బేస్ క్యాంప్ సందర్శనకు సంబంధిచిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఓ ఛానెల్ నిర్వహించిన ‘జై జవాన్’ కార్యక్రమంలో భాగంగా విజయ్ జవాన్లను కలిశాడు. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్మీ నేపథ్యంలో సాగే కథతో ‘జనగణమన’ అనే సినిమా చేయనున్నాడు. Photos, Video credit: Vijay Deverakonda /Instagram/twitter