రిలయన్స్ జియో ఫైబర్ గతేడాది, జియో ఎయిర్ ఫైబర్ ఈ ఏడాది లాంచ్ అయ్యాయి. జియో ఎయిర్ ఫైబర్ 30 ఎంబీపీఎస్ ప్లాన్ రూ.599 నుంచి ప్రారంభం కానుంది. జియో ఫైబర్ 30 ఎంబీపీఎస్ ప్లాన్ రూ.399 నుంచి స్టార్ట్ కానున్నాయి. జియో ఎయిర్ ఫైబర్ వైర్‌లెస్ డివైస్ కాగా, జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీ. జియో ఫైబర్ కంటే మెరుగైన కనెక్టివిటీ జియో ఎయిర్ ఫైబర్ అందించనుంది. కంపెనీ 5జీ సర్వీస్ అందించే ప్రతి చోటా జియో ఎయిర్‌ఫైబర్ పని చేస్తుంది. కానీ జియో ఫైబర్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. జియో ఫైబర్ కంటే జియో ఎయిర్‌ఫైబర్‌ను సులభంగా సెటప్ చేయవచ్చు. అయితే వైర్‌లెస్ కాబట్టి జియో ఫైబర్‌తో పోలిస్తే ఎయిర్ ఫైబర్ నెట్‌వర్క్ కాస్త ఒడిదుడుకులు ఎదుర్కునే అవకాశం ఉంది. జియో ఫైబర్ ప్రస్తుతం అన్ని భారతీయ నగరాల్లో ఉంది.