జస్ప్రీత్ బుమ్రా 28వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే కీలకంగా మారిపోయాడు.
24 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 2.65.
67 వన్డేల్లో 108 వికెట్లు తీశాడు. ఎకానమీ 4.65.
55 టీ20ల్లో 66 వికెట్లు కొల్లగొట్టాడు. ఎకానమీ 6.52.
టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు తీసిన రికార్డు అతడితే.
కపిల్‌దేవ్ 25 టెస్టుల్లో 100 వికెట్లు తీస్తే బుమ్రా 24 మ్యాచుల్లోనే తీశాడు.
ఐపీఎల్ సీజన్‌కు ముందే బుమ్రా పెళ్లి చేసుకున్నాడు.
క్రికెట్ ప్రజెంటర్ సంజనను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్‌గా బుమ్రాకు పేరుంది.