విక్కీ-కత్రినా పెళ్లి వేదిక ఈ కోటే బాలీవుడ్ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ జరగబోయేది రాజస్థాన్లోని ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా హోటల్’లో. ఈ కోట రాజస్థాన్లోని సావయ్ మదోపూర్ జిల్లాలో ఉంది. దీనిలో 48 గదులు ఉన్నాయి. అన్నీ ఫైవ్ స్టార్ సూట్సే. కోటకు తూర్పు వైపు ఉన్న పెద్దకిటికీల్లోంచి చూస్తే స్థానిక ప్రజల ఇళ్లు కనిపిస్తాయి. పడమర వైపు చూస్తే బర్వారా గ్రామం కనిపిస్తుంది. ఈ కోట నుంచి చూస్తే అందమైన సరస్సు, కొండమీద కొలువుదీరి ఉన్న దేవాలయం కనిపిస్తుంది. విక్కీ-కత్రినా వివాహ సంబరాలు డిసెంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. వీరి పెళ్లి కోసం గజెబో స్టైల్లో గ్లాసుతో మండపాన్ని సిద్ధం చేశారు. ఆ మండపంలోనే వీరి వివాహం జరగనుంది. కోటలో ఫిట్‌నెస్ సెంటర్ కూడా ఉంది విక్కీ-కత్రినా కోటకు డిసెంబర్ 6 ఆ రాత్రి తొమ్మిదిగంటలకు చేరుకుంటారు. కోట పెళ్లికి రాయల్ లుక్‌ను అందిస్తుంది.