డిసెంబర్‌ను ‘ప్రేమ నెల’గా ఎందుకు పిలుస్తారు? ఏడాదిలో చివరి నెల డిసెంబర్. చలికాలం కావడంతో దాదాపు అందరూ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. ఫ్యామిలీ అంతా కలిసి ఉంటుంది. క్రిస్మస్ సెలవులు చాలా దేశాల్లో పదిరోజుల పాటూ ఇస్తారు. దీంతో డిసెంబర్ వచ్చిందంటే క్రిస్మస్ కోసం కుటుంబాలన్నీ ఒక చోట చేరి పార్టీలు చేసుకుంటాయి. ఈ నెలలో మనుషుల చుట్టూ పాజిటివ్ ఆరా పరుచుకుంటుంది. అందరూ ప్రశాంతంగా ఉండడమే కాదు సాయంత్రానికి రొమాంటిక్ గా మారతారు. క్రిస్మస్ ను ప్రపంచంలోని చాలా దేశాల్లో నిర్వహించుకుంటారు. నెలంతా సెలెబ్రేషన్ మూడ్ ఉంటుంది. ఈ చల్లని నెలలో స్త్రీ పురుషులలో హార్మోన్లలో చాలా మార్పులు జరుగుతాయి. ప్రేమ హార్మోన్లు ఎక్కువై ఒకరినొకరు ఇష్టపడతారు. ఈ నెల్లోనే పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెకెషన్స్ ప్లాన్ చేసుకుంటారు. క్రిస్మస్, కొత్త ఏడాది వేడుకలకు ఆనందంగా సిద్ధమవుతుంటారు. చల్లగా ఉండే ఈ నెల్లోనే ఎక్కువ మంది బ్లాంకెట్స్ కప్పుకుని హాట్ చాకోలెట్ వంటి పానీయాలు తాగేందుకు ఇష్టపడతారు. అవి రొమాంటిక్ మూడ్ ను మరింత పెంచేస్తాయి. చాలా దేశాల్లోని ప్రజలు డిసెంబర్లో బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటుంటారు. రాత్రిపూట ఒక చోట చేరి నిప్పుల మంట వేసుకుని చలికాచుకుంటూ డిన్నర్ చేస్తారు.