మల్లెపూలు మంచి ఔషధాలు కూడా మల్లెపూల వాసన చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గినట్టు అనిపిస్తుంది. మల్లెపూలలో ఔషధ గుణాలు ఎక్కువ. మల్లెపూల వాసన రోజూ పీలుస్తుంటే మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. శరీరం ఉత్తేజంగా మారుతుంది. మల్లెపూలను నూరి తడి బట్టలో కట్టి కంటి మీద పెట్టుకుంటే కంటి నుంచి నీరు కారడం, పొడి బారడం వంటి సమస్యలు తగ్గుతాయి. మల్లె పూల రసాన్ని తీసి ముఖానికి రాసుకుంటే తాజాగా మారుతుంది. తలనొప్పి వస్తున్నప్పుడు మల్లెపూలను తరచూ వాసన చూస్తూ ఉండాలి. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది. కొబ్బరినూనెలో మల్లెపూలను వేసి బాగా నానబెట్టి తరువాత కాచి వడకట్టాలి. ఆ నూనెను తరచూ రాసుకుంటూ ఉంటే జుట్టు బలంగా మారుతుంది. మల్లెపూలతో టీ తయారుచేసుకుని తాగితే ఎంతో మంచిది. డయాబెటిస్ రోగులకు ఇది చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా మల్లెపూలకు విశిష్ఠ స్థానం ఉంది.