మజ్జిగలో లాక్టిక్ ఆసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్ ఉంటుంది.

మజ్జిగలో ఉండే సహజ ఈ పోషకాలు స్కాల్ప్ ను ఎక్స్ ఫోలియేట్ చేస్తాయి.

మజ్జిగలో ఉండే ప్రొటీన్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

నీటితో జుట్టు పూర్తిగా తడిపిన తర్వాత మజ్జిగను తలకు పట్టించి మసాజ్ చెయ్యాలి.

మసాజ్ వల్ల మజ్జిగ తలంతా సమానంగా పరుచుకుంటుంది.

పూర్తిగా తలంతా మజ్జిగ పట్టించి 10-15 నిమిషాల పాటు వదిలెయ్యాలి.

తర్వాత గోరువెచ్చిని నీటితో మజ్జిగ పూర్తిగా వదిలే వరకు శుభ్రంగా కడిగెయ్యాలి.

పొడి టవల్ తో తుడిచి జుట్టును ఆరబెట్టుకోవాలి. తుడిచే సమయంలో గట్టిగా రుద్ద కూడదు.

పాలు, పాల పదార్థాల అలర్జీ ఉన్న వారు మజ్జిగ తలస్నానానికి వాడకూడదు

Representational image:Pexels