రోజూ తమలపాకులు తింటున్నారా? లేదా?



తమలపాకులు రోజూ తినేవారు ఎంతో మంది. కొంతమంది మాత్రం వాటిని తినేందుకు ఇష్టపడరు.



రోజుకో యాపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదంటారు, అలాగే తమలపాకులు తిన్నా కూడా వైద్యుల అవసరం లేదు.



అధ్యయనాల ప్రకారం రోజుకు రెండు తమలపాకులు నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.



అయితే కిళ్లీ రూపంలో తమలపాకును నమలడం వల్ల ఉపయోగం లేదు. కేవలం తమలపాకులను మాత్రమే నమలాలి.



ఈ ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.



కాల్షియం లోపం ఉన్న వాళ్లు తమలపాకును కాస్త సున్నంలో కలిపి తింటే మంచిది. అయితే సున్నం రోజూ తినడం మంచిది కాదు.



బాలింతలు తమలపాకులు నమలడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.



డిప్రెషన్ వంటివి ఉన్న వారు తమలపాకులు రోజూ నమిలితే ఎంతో ఆరోగ్యం.