స్టార్ మా ఆదివారం పరివార్ కార్యక్రమంలో భాగంగా జానకి కలగనలేదు టీం మొత్తం ఇలా దెయ్యాలు గెటప్ వేశారు. ఉమ్మడి కుటుంబం విలువ తెలియజెప్పే సీరియల్ గా జానకి కలగనలేదు సీరియల్ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఈ సీరియల్ లో రామాగా నటిస్తున్న అమర్ దీప్ మరో నటి తేజస్విని గౌడని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే ఈ జంటకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అమర్ దీప్ నటించిన 'ఐరావతం' వెబ్ సిరీస్ ఇటీవలే విడుదల అయ్యింది జానకి కలగనలేదు సీరియల్ లో జానకిగా నటిస్తున్న ప్రియాంక జైన్ కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. మౌనరాగం సీరియల్ నటుడు శివ కుమార్ ని జానకి(ప్రియాంక జైన్ )ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. 'మిస్టర్ పెళ్ళాం' అనే మరొక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అమర్ దీప్.