'జానకి కలగనలేదు' సీరియల్ రామాగా బుల్లితెర ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న నటుడు అమర్ దీప్ చౌదరి. 'కోయిలమ్మ', 'కేరాఫ్ అనసూయ' సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి తేజస్విని గౌడ్. గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుంది. ఈ జంట పెళ్లి వేడుక సంబరాలు మొదలైపోయాయి. కన్నుల పండుగగా హల్దీ వేడుక జరిగింది. తెలుపు రంగు లంగా వోణీ లో తేజస్విని మల్లెపువ్వులా మెరిసిపోయింది. సహ నటులు, కుటుంబ సభ్యుల మధ్య హల్దీ వేడుక ఘనంగా జరిగింది. అతిథులు అందరూ కాబోయే వధూవరులకి పసుపు పూసి ఆశ్వీరదించారు. చూడముచ్చటగా ఉన్న ఈ జంట హల్దీ వేడుక మీరు చూసేయండి. హల్దీ వేడుక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమర్ దీప్ నటించిన 'ఐరావతం' వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో , ఆహాలో 'మిస్టర్ పెళ్ళాం' సీరియల్ వెబ్ సిరీస్ తోను అలరిస్తున్నాడు. అమర్ దీప్ ని ఎత్తుకుని రచ్చ చేస్తున్న 'జానకి కలగనలేదు', 'కేరాఫ్ అనసూయ' నటీమణులు