ప్రస్తుతం మనదేశంలో టాప్ హీరోయిన్లలో పూజా హెగ్దే ఒకరు.

తెలుగు, హిందీ సినిమాల్లో తన చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి.

మనదేశంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో కూడా పూజా ముందుంటారు.

ఈ సంవత్సరం ఇప్పటికే పూజా హెగ్దే మూడు సినిమాలు విడుదలయ్యాయి.

రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాల్లో పూజా హీరోయిన్‌గా నటించింది.

రణ్‌వీర్ సింగ్ జంటగా నటించిన ‘సర్కస్’ ఈ నెల 23న విడుదల కానుంది.

సల్మాన్ ఖాన్‌ సరసన నటిస్తున్న ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్’ వచ్చే సంవత్సరం రానుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ సరసన నటించాల్సిన ‘జనగణమన’ అనుకోకుండా ఆగిపోయింది.

కానీ పూజా కెరీర్ మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.
(All Images Credits: Pooja Hegde Instagram)