జాకీ చాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలో అరుదైన సంగతులు, విశేషాలు

జాకీ చాన్ ఏప్రిల్ 7, 1954 లో జన్మించారు. ఏడేళ్ల వయసులో తల్లిదండ్రులకు దూరం కావడంతో బోర్డింగ్ స్కూల్ లో చదువుకున్నారు. 

జాకీ చాన్ తల్లి ఒకసారి డ్రగ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన తండ్రికి నేర చరిత్ర ఉందట. నేషనల్ స్పై అని టాక్. ఏడేళ్ల వయసులో తండ్రికి దూరమైన ఆయన, మళ్ళీ 2003లో కలిశారు. తల్లి 2001లో మరణించారు. 

ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్ తో జాకీ చాన్ 

జాకీ చాన్ 'ఆల్ ఇన్ ద ఫ్యామిలీ' అనే ఒక అడల్ట్ ఫిల్మ్ లో నేకెడ్ గా కనిపించారు. బతకడం కోసం అప్పట్లో తప్పలేదని తర్వాత ఒకసారి వ్యాఖ్యానించారు.

మార్షల్ ఆర్ట్స్ సూపర్ స్టార్ బ్రూస్ లీ సినిమాలు 'ఎంటర్ ద డ్రాగన్', 'ద చైనీస్ కనెక్షన్' సినిమాలో జాకీ చాన్ చిన్న పాత్రలు చేశారు.

జాకీ చాన్ యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు డూప్ అవసరం లేదు. అయితే ఒక్కోసారి వాకింగ్ సీన్స్ కోసం డూప్ తో మేనేజ్ చేస్తారు.

'రష్ అవర్'తో జాకీ చాన్ కు హాలీవుడ్ / అమెరికాలో బ్రేక్ వచ్చింది.

హాంకాంగ్ లో ఓసారి విమానంలో జాకీ చాన్ మీద ఎటాక్ జరిగింది. ఆ తర్వాత ఒకసారి గన్, గ్రనేడ్స్ పట్టుకుని ఎటాక్ చేయడానికి వచ్చినవాళ్లపై జాకీ ఎదురు తిరిగారు. 

నిర్మాత రేమండ్ చౌతో జాకీ చాన్. 

'చైనీస్ జోడియాక్' సినిమాకు జాకీ చాన్ దర్శకుడు, నిర్మాత, ఫైట్ మాస్టర్. ఇలా 15 శాఖల్లో బాధ్యతలు నిర్వర్తించినందుకు గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఎక్కారు. 

'ఐయామ్ జాకీ చాన్: మై లైఫ్ ఇన్ యాక్షన్' - జాకీ చాన్ స్వయంగా రాసిన ఆటోబయోగ్రఫీ ఇది. 'నెవర్ గ్రూ అప్' అని మరో పుస్తకాన్ని జూ మో రాశారు. 

'ఆర్మర్ ఆఫ్ గాడ్' సినిమా కోసం రిస్కీ షాట్స్ చేస్తున్నపుడు జాకీ చాన్ చెట్టు మీద నుంచి కింద రాయి మీద పడ్డారు. గాయాలు కావడంతో తలలో మెటల్ ప్లేట్ వేసి సర్జరీ చేశారు. 

ABP Desam తరపున జాకీ చాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. (All Image courtesy: jackie chan / instagram)