ABP Desam


ఏప్రిల్ 7 గురువారం రాశిఫలాలు


ABP Desam


మేషం
వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణ సమయంలో అవసరమైన పత్రాలను మీతో తీసుకెళ్లండి. కార్యాలయంలో మంచి ఆదాయ అవకాశాలు ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి.


ABP Desam


వృషభం
దంపతుల మధ్య ఏర్పడిన విభేదాలు ఈరోజు పరిష్కారమవుతాయి.బంధువులను కలుస్తారు. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ గురించి సమాచారాన్ని పొందాలనే ఆలోచనలో ఉన్నారు. కొత్త పనులు ప్రారంభించగలరు.


ABP Desam


మిథునం
మీ సామర్థ్యంపై నమ్మకం ఉండాలి. ఒకరి మాటలు విని మీ ప్రియమైన వారిని అనుమానించకండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫీల్డ్ వర్క్ చేసేవారికి ఈ రోజు కలిసొచ్చే రోజు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.అనారోగ్య సూచనలున్నాయి.


ABP Desam


కర్కాటకం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది.మీరు ఉద్యోగంలో ప్రమోషన్ గురించి సమాచారాన్ని పొందవచ్చు. ఆదాయం పెరుగుతుంది. బాధ్యతను సకాలంలో నెరవేరుస్తారు.విద్యార్థులు విజయం సాధించగలరు. అధిక వేడిలో తిరగొద్దు. మాటల విషయంలో సంయమనం పాటించాలి.


ABP Desam


సింహం
మీరు ఈరోజు సానుకూలంగా ఉంటారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. అక్కడక్కడా మాట్లాడుకునే వారి పట్ల జాగ్రత్త వహించండి.ఎవరైనా రెచ్చగొట్టినా కోపం తెచ్చుకోకండి.


ABP Desam


కన్యా
ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని పనుల్లో నష్టపోయే అవకాశం ఉంది. అపవాదాలకు దూరంగా ఉండండి. అనవసరమైన వస్తువులను కొనడానికి ఖర్చు చేయవద్దు. నెలవారీ బడ్జెట్‌పై శ్రద్ధ వహించాలి. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది.


ABP Desam


తులా
ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగులకు బాధ్యత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. రహస్యాన్ని ఎవరికీ చెప్పొద్దు..


ABP Desam


వృశ్చికం
విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. సమయం-పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకోండి. మీరు ఇల్లు లేదా భూమిలో పెట్టుబడి పెడతారు. ఇంతకుముందు పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. . కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా నిర్ణయం రావచ్చు.



ధనుస్సు
చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. టెన్షన్ పెరుగుతుంది. కార్యాలయంలో అధికారులతో వాగ్వివాదం రావొచ్చు. ఆస్తికి సంబంధించిన విషయాల వల్ల కుటుంబంలో కలహాలుంటాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.



మకరం
ఈరోజు మీకు సంతోషకరమైన రోజు. ఆహారం విషయంలో తొందరపడకండి. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మీరు వేరే నగరానికి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో మందగమనం దూరమవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు.



కుంభం
పాత మిత్రులతో గడుపుతారు. బంధువుతో వాగ్వాదం ఉండొచ్చు.ఆఫీసులో బాధ్య పెరుగుతుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల సహాయం తీసుకోండి. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంపద మరియు ఆస్తి రక్షణ కోసం తగిన ఏర్పాట్లు చేయండి.



మీనం
ఈరోజు మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. తలపెట్టిన పనులు పూర్తిచేయలేరు. కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త..గాయపడే ప్రమాదం ఉంది. భగవంతుని ఆరాధనలో నిమగ్నమై ఉంటారు. విద్యార్థులు, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు.