‘బిగ్ బాస్’ అభిమానులను అన్ని సీజన్లో మీకు ఏ సీజన్ నచ్చిందని అడిగితే సీజన్ 4 అనే చెబుతారు. ‘బిగ్ బాస్’ సీజన్ 4లో అభిజీత్, అఖిల్, సోహెల్, మోనల్ మధ్యే షో మొత్తం నడించింది. అభిజీత్-అఖిల్ మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోరు నడించింది. 2020లో జరిగిన ‘బిగ్ బాస్’ సీజన్-4లో అభిజీత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ‘బిగ్ బాస్’లో అభి కేవలం నోయల్, దేత్తడి హరికతో మాత్రమే స్నేహంగా ఉండేవాడు. అభిమానులు వారిని #nobika అని ముద్దుగా పిలుచుకొనేవారు. నోయెల్ ఎలిమినేట్ అయిన తర్వాత అభి-హారికల మధ్య స్నేహం మరింత బలపడింది. ‘బిగ్ బాస్’ సీజన్-4 తర్వాత అభి-హారిక కలిసి కనిపించలేదు. ‘బిగ్ బాస్’ నుంచి బయటకు రాగానే అభి.. రెక్కలొచ్చిన పక్షిలా విదేశాలకు ఎగిరిపోయాడు. ఏడాదిన్నర తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన అభి.. ఫ్రెండ్స్ హారిక, నోయెల్‌లను కలుసుకున్నాడు. ఆ ఫొటోలను అభి, హారిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. Image Credit: Abijeeth and Harika/Instagram and Star Maa