జబర్దస్త్ వర్ష తన లేటెస్ట్ రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇటీవల విడుదల అయిన ‘90s’ వెబ్ సిరీస్‌లో ఒక మ్యూజిక్ బాగా వైరల్ అయింది. ఆ వైరల్ మ్యూజిక్‌తో రీల్ చేసి వర్ష తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకున్నారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు ఎనిమిది వేల వరకు లైకులు వచ్చాయి. ఫ్యాన్స్ కామెంట్స్ కూడా పెడుతుండటం విశేషం. జబర్దస్త్ షోతో వర్ష వెలుగులోకి వచ్చారు. ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేస్తూ వర్ష ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. తను ఇన్‌స్టాలో పోస్టులు పెట్టడం ఆలస్యం వేలల్లో లైకులు వస్తాయి. వర్షకు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. దానికి నాలుగు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉండటం విశేషం.