నాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు - జబర్దస్త్ రాకేష్ ఎమోషనల్ వీడియో వైరల్! జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. జబర్దస్త్ లో మొదట కంటెస్టెంట్ ఉన్న రాకేష్ తనదైన పంచులతో ఆడియన్స్ ని ఆకట్టుకొని టీమ్ లీడర్ గా ఎదిగాడు. చిన్న పిల్లలతో రాకేష్ చేసే స్కిట్స్ కి మంచి ఆదరణ లభించింది. తన టీమ్ లో చేసిన జోర్ధార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట జబర్దస్త్ తో పాటూ సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ సైతం రన్ చేస్తున్నారు. ఇటీవల 'KCR' అనే మూవీతో హీరోగా మారాడు రాకింగ్ రాకేష్. తన కొత్త మూవీ వాయిదా పడటంపై స్పందించిన రాకింగ్ రాకేష్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మీరూ చూసేయండి. Photo Credit : Rocking Rakesh/Instagram