షాకింగ్.. బీట్‌రూట్, దానిమ్మతో ‘రక్తం’ పెరగదా? బీట్‌రూట్, దానిమ్మ ఎర్రగా ఉంటాయి కదా శరీరానికి రక్తం పడుతుందని భావిస్తాం. అయితే, న్యూట్రీషియన్ నిపుణులు అలాంటిది ఏమీ ఉండదని, వాటి ప్రభావం కొద్దిగానే ఉంటుందని అంటున్నారు. ఒక దానిమ్మ పండులో ప్రతి వంద గ్రాములకు సుమారు 30 mg ఐరన్ మాత్రమే ఉంటుందట. బీట్‌రూట్‌లో 100 గ్రాములకు కేవలం 0.75 mg ఇనుము ఉంటుందట. ఐరన్ తక్కువగా ఉన్నంత మాత్రాన్న అవి ఆరోగ్యకరమైనవి కాదని కాదు. వాటిలోనూ పలు పోషకాలు పుష్కలం. బీట్‌రూట్‌లో విటమిన్-A పుష్కలంగా ఉంటుంది. అయితే, బీట్ రూట్ మోతాదుకు మించి తీసుకోకూడదట. బీట్‌రూట్‌లోని అధిక కాల్షియం ఆక్సలేట్ కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుందట. ఫలితంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. కడుపు నొప్పి వస్తుంది. అయితే, దానిమ్మ.. బీట్ రూట్ ఎర్ర రక్త కణాల తయారీకి నెమ్మదిగా సహకరిస్తాయి. Images Credit: Pexels