గుడ్డు తప్పకుండా ప్రతి రోజూ తీసుకోవాల్సిన పోషక పదార్థమని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ప్రొటీన్, విటమిన్ ఏ, కోలిన్, బయోటిన్, విటమిన్ డీ3, కాపర్ మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. రోజూ గుడ్డు తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. నాటు కోడి గుడ్లలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువ. అయితే ఈ గుడ్లను పాశ్చరైజ్ చేసి తీసుకోవడం సురక్షితం అని సలహా ఇస్తున్నారు. తాజా గుడ్డు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. దీని కోసం ఫ్లోటింగ్ టెస్ట్ చేసుకోవచ్చు. రోజుకు రెండు మూడు గుడ్లు తినవచ్చు. చేసే పని, శారీరక శ్రమ, జీవన శైలి వంటి వన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. Representational Image : Pexels