రంగు రుచిలో చాలా ప్రత్యేకంగా కనిపించే దుంప కూరగాయ బీట్ రూట్. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం బీట్ రూట్ తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. కనుక రక్తంలో షుగర్ లెవెల్స్ త్వరగా పెరగవు . ఒక అధ్యయనం ప్రకారం యాంటీఆక్సిడెంట్ల స్థాయిలు పెరిగితే డయాబెటిక్స్ లో సమస్యలు తగ్గాయట. బీట్ రూట్ లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. బీటాలైన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. బీట్ రూట్ తరచుగా తీసుకుంటే మధుమేహుల్లో ఆక్సిడేషన్ ఒత్తిడి తగ్గుతుంది. బీట్ రూట్ లో ఫైబర్ చాలా ఎక్కువ. కార్బోహైడ్రేట్లను శోషిస్తుంది. కనుక మధుమేహులకు చాలా మంచి ఆహారం. బీట్ రూట్ మంచి ఆహారం అయినప్పటికీ పరిమితంగా తీసుకోవాలి. అరకప్పు నుంచి ఒక కప్పు వరకు తీసుకోవచ్చు. వీటిని తినే ముందు వైద్యుల సలహా తీసుకోండి. Image courtesy : Pexels