ఎముకలు బలంగా ఉండేందుకు క్యాల్షియం అవసరం.

ఎదిగే వయసులో ఎముకలు బలంగా పెరిగేందుకు, పెద్దవారిలో ఎముక సాంద్రత తగ్గకుండా ఉండేందుకు కూడా కాల్షియం అవసరం.

పాలు, పాల పదార్థాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు వీటి ద్వారా విటమిన్ డి కూడా అందుతుంది.

ఆకుకూరల్లో విటమిన్లు, మినరల్స్ తో పాటు కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. క్యాలరీలు కూడా తక్కువ.

కొన్ని రకాల చేపల్లో ఒమెగా3 తోపాటు కాల్షియం కూడా ఉంటుంది.

సోయా పాలతో చేసిన టోఫూలో కాల్షియం అధికం.

లెగుమినేసికి చెందిన అన్ని రకాల పప్పులు, చిక్కుళ్లలో కాల్షియం ఉంటుంది.

షియా సీడ్స్, అవిసెగింజలు, బాదాముల వంటి వాటితో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. వీటిలో కాల్షియం పుష్కలం.

ఆరెంజ్, కివి ఇతర సిట్రస్ పండ్ల నుంచి కూడా కాల్షియం అందుతుంది.



క్వినోవా లో ప్రొటీన్, ఫైబర్ తో పాటు కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది.
Images courtesy : Pexels