తలనొప్పి వచ్చినప్పుడు పడుకుంటే చాలా రిలీఫ్‌గా ఉంటుంది. అయితే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మీరు రిలాక్స్‌గా ఉండొచ్చు. డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వచ్చే ఆస్కారముంది కాబట్టి నీరు తాగండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉన్న అల్లాన్ని మీ డైట్లో చేర్చుకోవచ్చు. మీకు కాఫీ లేదా టీ అలవాటు ఉంటే.. వేడి వేడి కప్పు టీ లేదా కాఫీ తాగండి. మెగ్నిషియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది. అరటిపండ్లు, సాల్మన్ ఫిష్‌లు కూడా తలనొప్పినుంచి ఉపశమనం అందిస్తాయి. గోధుమలు, తులసి, పుదీనా వంటివి కూడా తలభారాన్ని తగ్గిస్తాయి. (Image Source : Unsplash)