పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరి నిద్రకు పాలు నిజంగా సహాయపడతాయా? మనలో చాలా మందికి నిద్రపోయే ముందు పాలు తాగి పడుకోవడం అలవాటు. కానీ అనేక అధ్యయనాల ప్రకారం నిద్రపోయే ముందు పాలు తాగడం ప్రయోజనాల కలిగించే దాని కంటే హాని ఎక్కువ. నైట్ టైమ్ పాలు తాగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది. కొందరిలో కడుపు నొప్పి వస్తుంది. కాలేయం పనితీరుని మందగించేలా చేస్తుంది. రాత్రిపూట పాలు తీసుకోవడం జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుందని కొందరు వాదిస్తారు. నిద్రవేళకు ముందు పాలు తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఒక గ్లాసు పాలలో దాదాపు 120 కేలరీలు ఉంటాయి. ఈ కేలరీలు నిద్రపోతున్నప్పుడు తగినంతగా బర్న్ చేయకపోవచ్చు. ఇది బరువు పెరగడానికి దోహదపడుతుంది. రాత్రి పూట పాలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. పాలు తాగిన వెంటనే పడుకుంటే జీర్ణక్రియ కష్టతరం చేస్తుంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం పాలు తాగడానికి ఉత్తమ సమయం నిద్రవేళకు కనీసం రెండు నుంచి మూడు గంటల ముందు తాగొచ్చు. అది కూడా కొద్ది మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. Images Credit: Pexels