ఐరన్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది.



వోట్స్, క్వినోవా, బార్లీ వంటి మిల్లెట్స్ లో ఇతర పోషకాలతోపాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది.



బాదం, జీడిపప్పు, నువ్వుులు, పొద్దుతిరుగుడు గింజల్లో ఐరన్ అధిక మొత్తంలో ఉంటుంది. వీటిని రోజూ డైట్లో చేర్చుకోవాలి.



బంగాళదుంపలోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఆలు పొట్టుతో తింటే అధిక ప్రయోజనాలు పొందవచ్చు.



క్లామ్స్, గుల్లలు, పీతల్లో కూడా ఐరన్ ఉంటుంది. వీటిని వారానికి రెండు సార్లు ఆహారంలో చేర్చుకోవాలి.



కాలే, బచ్చలికూర, స్విస్ చార్డ్ వంటి ఆకుకూరల్లో ఇతర ఖనిజాలతోపాటు ఐరన్, విటమిన్స్ ఉంటాయి.



డార్క్ చాక్లెట్, కోకోపౌడర్ లో ఐరన్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.



చేపలు, సార్డినెస్ లో ఐరన్ తోపాటు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.



బీన్స్, పింటో బీన్స్, కిడ్నీ బీన్స్ వంటి కాయధాన్యాల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎసిడిటీతో ఉంటే మితంగా తినాలి.