ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 వేలంలో ముంబై ఇండియన్స్ చాలా డబ్బు ఖర్చు పెట్టింది. నలుగురు ఆటగాళ్ల కోసం 2.20 కోట్లు ముంబై వెచ్చించింది. జి కమలిని బేస్ ప్రైస్ కంటే చాలా రెటు ఇచ్చి కొనుగోలు చేసింది. కమలినితోపాటు అక్షితా మహేశ్వరి, సంస్కృతి గుప్తా, నాడిన్ డి క్లర్క్‌ను ముంబై సొంతం చేసుకుంది. కమలినిని రూ.1.6 కోట్లకు నాడిన్ డి క్లర్క్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. 20 లక్షలకు అక్షితా మహేశ్వరిని రూ.10 లక్షలకు సంస్కృతి గుప్తాను సొంతం చేసుకుంది. ముంబై జట్టులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు, 12 మంది ఇండియన్స్ ఉన్నారు. అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలితా, నాట్ స్కివర్-బ్రంట్, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, సజ్నా సజీవన్, కె అమన్‌దీప్ కపూర్, జి కమలిని, నాడిన్ డి క్లర్క్, సంస్కృతి గుప్తా, అక్షితా మహేశ్వరి