యాపిల్ తన కొత్త బడ్జెట్ ఫోన్ ఐఫోన్ ఎస్ఈ 3ని ఈ సంవత్సరమే లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.



2022 ఐఫోన్ ఎస్ఈ మోడల్‌లో 5జీ కనెక్టివిటీ ఉండనుంది.



ఇందులో లేటెస్ట్ ఏ-సిరీస్ ప్రాసెసర్ అందించనున్నారు.



2022లో వచ్చే ఐఫోన్ ఎస్ఈ మొబైల్‌లో 3 జీబీ ర్యామ్ అందించనున్నట్లు తెలుస్తోంది.



అలాగే 2024లో వచ్చే ఐఫోన్ ఎస్ఈ 4 జీబీ ర్యామ్ ఉండనుందని వార్తలు వస్తున్నాయి.



ఈ సంవత్సరం వచ్చే ఐఫోన్ ఎస్ఈలో 4.7 అంగుళాల డిస్‌ప్లే ఉండనుందని తెలుస్తోంది.



ఇక ఆ తర్వాత తరం ఐఫోన్‌లో 5.7 అంగుళాల నుంచి 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.



2023లోనే మరో ఐఫోన్ ఎస్ఈ రావాల్సి ఉన్నా దాన్ని యాపిల్ 2024కు వాయిదా వేసింది.



ఈ సంవత్సరం రానున్న ఐఫోన్ ఎస్ఈ లుక్ చూడటానికి ఐఫోన్ 8 తరహాలో ఉంది.



ఈ ఫోన్‌లో ఏ14 బయోనిక్ చిప్‌ను అందిస్తారా లేక ఏ15 బయోనిక్ చిప్‌ను అందిస్తారా అనే విషయాలు తెలియరాలేదు.