పసుపు అధికమైతే ఐరన్ లోపం... జాగ్రత్త

కరోనా వచ్చాక పసుపు వినియోగం పెరిగింది. వంటల్లో దానికిచ్చే ప్రాధాన్యత కూడా ఎక్కువైంది.

పసుపులో యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు పసుపు వాడకాన్ని ప్రజలు పెంచారు.

ఏదైనా అతి చేస్తే అనర్థమే. అలాగే పసుపు కూడా అధిక వినియోగం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది.

హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేయడానికి మన శరీరానికి అవసరమయ్యే అత్యవసర ఖనిజం ఐరన్. ఇది శరీరం ఇనుమును శోషించుకునే గుణాన్ని తగ్గిస్తుంది.

పసుపు అధికంగా తినడం వల్ల ఇనుము శోషణ 20 శాతం నుంచి 90 శాతానికి పడిపోతుంది.

పసుపులో కీలకమైన పదార్థం కుర్కుమిన్. ఇది ఫెర్రిక్ కర్కుమిన్ సమ్మేళనాన్ని తయారుచేయడానికి ఇనుమును బంధిస్తుంది.

పసుపు మితంగా తీసుకుంటే అది అన్నివిధాలుగా మీకు ఆరోగ్యాన్ని అందిస్తుంది.

వంటల్లో వేసుకుని తిన్నంత వరక ఓకే, కానీ కొందరు కర్కుమిన్ సప్లిమెంట్లు తీసుకుంటారు. వీటి వల్లే సమస్య మొదలవుతుంది.

పసుపులో ఉండే గుణాల కోసం సప్లిమెంట్లు, ఇంజెక్షన్లను ప్రయత్నించకండి