కాఫీ తాగాల్సిన పద్ధతి ఇది ఒక్క రోజు కాఫీ తాగకపోయినా ఆ రోజంతా ఏదో కోల్పోయిన వారిలా కనిపిస్తారు చాలామంది. కాఫీ మితంగా తాగితే ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో, అధికంగా తాగితే అన్ని నష్టాలున్నాయి. కాఫీని తాగే పద్ధతుల్లో కొంచెం మార్పులు చేస్తే చాలు అది మీకు ఆరోగ్యాన్ని అందించే పానీయంగా మారుతుంది. మగ్ లో కాఫీ తాగవద్దు. చక్కటి టీ కప్ తీసుకుని, ఆ పరిమాణంలోనే తాగండి. మగ్‌లు మీకు తెలియకుండానే అతిగా కాఫీ తాగేలా చేస్తాయి. సాయంత్రం అయిదు గంటలలోపే కాఫీని తాగాలి. ఆ సమయం దాటాకా తాగకపోతేనే ఆరోగ్యం. అయిదు దాటాక తాగేవారిలో నిద్రలేమి సమస్యలు కలుగుతాయి. పంచదారను తెల్లటి విషం అనే చెప్పచ్చు. కాఫీ ఎంత తియ్యగా ఉంటే అది అంతగా మీకు హాని చేస్తుంది. ఒక చిన్న గ్లాసు కాఫీ చాలు మీ మూడ్ మారి, ఉత్సాహంగా మారడానికి. అంతేతప్ప ఎంత ఎక్కువ కాఫీ తాగితే అంత లాభం అనుకోవద్దు.