అల్ బుకరా పండ్లలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. కాలేయం కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది. ఈ పండ్లలో లభించే బోరాన్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఎర్రగా ఉండే ఈ పండ్ల తొక్కలతో పెదవులు మర్దన చేసుకోవచ్చు. దాని వల్ల నల్లగా ఉండే పెదవులు ఎర్రగా కనిపిస్తాయి. జుట్టు రాలకుండా చేస్తుంది. చుండ్రు సమస్యని నివారిస్తుంది. జుట్టు కుదుళ్లు బలపడేందుకు సహాయపడుతుంది. ఈ పండ్లలో ఇసాటిన్, సార్బిటాల్ ఉన్నాయి. ఇవి మలబద్ధకాన్ని తగ్గించడానికి జీర్ణక్రియని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకి ఇది చాలా మేలు చేస్తుంది. కడుపులోని బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. ఫ్లూ, జలుబు, జ్వరాలతో పోరాడేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది. సీజనల్ వ్యాధులు అడ్డుకుంటుంది. అల్ బుకరా పండ్లలో యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తో నిండి ఉన్నాయి. ఇవి అనేక దీర్ఘకాలిక వ్యాధులని అభివృద్ధి చేసే అవకాశాన్ని తగ్గిస్తాయి.