బస్సుల్లోనే కాదు.. ఎన్నో సందర్భాల్లో ఉమెన్ కార్డ్ చూసి వెనక్కి తగ్గిన మీకు థ్యాంక్యూ.

ఎక్కడో.. ఎవరో చేసిన పనికి మీ అందరినీ బ్లేమ్ చేస్తున్నా మౌనంగా భరిస్తున్నందుకు థ్యాంక్స్.

ఏదో సాధించాలనే గోల్ మీకున్నా.. ఫ్యామిలీ కోసం జాబ్స్ చేస్తున్నందుకు థ్యాంక్స్.

ఇంట్లో అందరూ కడుపు నింపాలని.. ఇంటిబయటి కష్టాలు పడుతున్నందుకు థ్యాంక్స్.

పిల్లల చదువుల కోసం.. ఎక్స్​ట్రా అవర్స్ వర్క్ చేస్తున్న నాన్నలకు థ్యాంక్స్.

చదువుకున్నా జాబ్స్ రాక.. ఇంట్లో వాళ్లని డబ్బులు అడగలేక పార్ట్​టైమ్ జాబ్స్ చేస్తున్న మీకు థ్యాంక్స్.

తోడబుట్టినా, దేవుడిచ్చిన సిస్టర్స్​కు తోడుగా, రక్షణగా ఉంటున్న బ్రదర్స్​కు థ్యాంక్స్.

బాయ్ ఫ్రెండ్, బాయ్ బెస్టీలంటూ మీలో మీరు కొట్టుకుంటూ.. వెంటనే మావా అని సర్దుకుపోయే మీ గుణానికి థ్యాంక్స్.

ఫైనల్​గా హ్యాపీ మెన్స్ డే.