అప్పుడప్పుడు పెరుగు మిగిలి పోతుంటుంది. మిగిలిపోయిన పెరుగు వాడుకునేందుకు కొన్ని చిట్కాలు

మిగిలిపోయిన పెరుగులో కొన్ని పండ్ల ముక్కలు, తేనే కలిపి ఐస్ క్యూబ్స్ తో స్మూదీగా సర్వ్ చెయ్యవచ్చు.

తాజా పండ్లు, గ్రనోలా, తేనె చుక్కలతో కలిపి పర్పైట్ తయారు చెయ్యవచ్చు.

చక్కెర, ఐస్ క్రీమ్ వంటి వి కలిపి లస్సీ గా చేసి తాగచ్చు .

బట్టర్ మిల్క్ బదులుగా పెరుగులో కాస్త నీళ్లు కలిపి పలుచగా చేసి వాడుకోవచ్చు.

పెరుగులో మసాలాలు, హెర్బ్స్ వెల్లుల్లి కలిపి చిప్స్ ఇతర స్నాక్స్ కోసం డిప్స్ గా వాడుకోవచ్చు.

చికెన్ లేదా ఇతర ప్రోటిన్ రిచ్ ఫుడ్ తయారీలో మెరినేడ్ చేసేందుకు పెరుగును వాడొచ్చు.

పెరుగును నిమ్మరసం, కొద్దిగా మసాల దినుసులు కొద్దిగా ఆలీవ్ నూనెతో కలిపి సలాడ్ డ్రెస్సింగ్ తయారు చెయ్యవచ్చు

పాప్సికల్ అచ్చుల్లో తాజా పండ్లు లేదా పండ్ల ప్యూరీ కలిపి చల్లబరిచి ఆరోగ్యవంతమైన ట్రీట్ తయారు చెయ్యవచ్చు.

కేకులు, మఫిన్స్ వంటి బేక్ చేసే పదార్థాల తయారీలో పాలు, బట్టర్ మిల్క్ బదులుగా పెరుగు వాడొచ్చు.

సౌందర్య పోషణలో హెయిర్ మాస్కులు, ఫేస్ మాస్కుల తయారీలో కూడా పెరుగును వాడొచ్చు.

Representational Image : Pexels