తొలి జంక్ ఫుడ్ సమోసానే ఆలూ సమోసా, ఉల్లిపాయ సమోసా, కార్న్ సమోసా, పనీర్ సమోసా, కీమా సమోసా... ఇలా ఎన్నో రకాల సమోసాలు నోరూరిస్తుంటాయి. సమోసా మన దేశానికి చెందిన వంటకం కాదు. కానీ మనదేశంలో ఇదే తొలి ఫాస్ట్ ఫుడ్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రాచీన ఇరాన్ దేశం నుంచి సమోసా భారతదేశానికి చేరిందని చెబుతారు. అంటే వేల మైళ్లు ప్రయాణించి వచ్చిందన్నమాట. ఇరాన్ నుంచి వచ్చిన వర్తకులు సమోసాలను తమతో పాటూ తీసుకొచ్చి ఇక్కడి వారికి రుచి చూపించారు. రుచి నచ్చడంతో బాగా పాపులర్ గా మారి ఇక్కడ స్థానిక వంటకంగా మారిపోయింది. మనదేశానికి చేరాక సమోసా కొత్త రుచులను కలుపుకుంది. స్థానిక వంటకాలకు తగ్గట్టు ఇందులో అల్లం, కొత్తిమీర, జీలక్ర్ర వంటివి కూడా కలిపి వండడం మొదలుపెట్టారు. నూనెలో డీప్ వేయించే ఈ సమోసాను ప్రపంచంలోనే తొలి ఫాస్ట్ ఫుడ్ అని చెబుతారు కొంతమంది చరిత్రకారులు. సమోసా హై కేలరీ ఫుడ్ అనే చెప్పాలి. మీడియం సైజులో ఉండే సమోసా తింటే 300 కేలరీలు లభిస్తాయి.