‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో హీరోగా మారాడు అభిజీత్. మొదటి సినిమా ఫ్లాప్‌తో అభిజీత్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, ‘పెళ్లిగోల’ వెబ్‌సీరిస్‌తో అభిజీత్ యూత్‌కు దగ్గరయ్యాడు. ఆ తరువాత బిగ్ ‘బాస్ సీజన్ 4’లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. ‘బిగ్ బాస్’ అభిజీత్‌ను చూసి మరింత మంది అభిమానించడం మొదలెట్టారు. ఆ అభిమానమే అభిజీత్‌ను ‘బిగ్ బాస్’ విన్నర్ చేసింది. ఈ క్రేజ్‌తో అభికి 2 సినిమాలు, 12 వెబ్ సిరీస్‌ల్లో ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అభి కేవలం ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ అనే వెబ్ సీరిస్‌లో చేస్తున్నాడు. ఈ వెబ్ సీరిస్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సీరిస్‌లో ఆది పినిశెట్టి, నిత్య మీనన్, రీతూ వర్మ, మాళవిక నటిస్తున్నారు. Images Credit: Abhijeeth/Instagram