ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ప్రభాస్ అజయ్ దేవగన్ నటించిన బాలీవుడ్ సినిమా 'యాక్షన్ జాక్సన్' లో ఒక పాటలో అతిథిగా కనిపించారు. ప్రభాస్ నటుడు కావాలని అనుకోలేదట. హోటల్ వ్యాపారి అవ్వాలని అనుకున్నట్లు గతంలో ఒకసారి చెప్పాడు. బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన తొలి దక్షిణాది స్టార్ మైనపు విగ్రహం ప్రభాస్ ది కావడం విశేషం. అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే.. తనకి మాత్రం రాజ్ కుమార్ హిరాణీ అంటే పిచ్చి. ఆయనకి ప్రభాస్ వీరాభిమాని. బాహుబలి కోసం ఫిట్ నెస్ కావాలని ప్రభాస్ తన ఇంట్లో ఏకంగా వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నాడు. బాహుబలి సినిమా కోసం దాదాపు 30 కిలోల బరువు పెరిగాడు. నాలుగేళ్ల పాటు ఇదే సినిమా కోసం ఇక ఏ ఇతర సినిమాల మీద సైన్ చెయ్యలేదు. హాలీవుడ్ స్టార్ లెజెండ్ రాబర్ట్ డి నీరో తన రోల్ మోడల్. ఆయనకి వీరాభిమాని. బాహుబలి సినిమాలో చేసేటప్పుడు ఒక యాడ్ లో నటించేందుకు రూ.5 కోట్ల ఆఫర్ కూడా వచ్చిందట. కానీ ఆయన తిరస్కరించారు.