ABP Desam

టాలీవుడ్‌లో అత్యధిక తల్లిపాత్రలు పోషించిన నటుల్లో ప్రగతి కూడా ఒకరు.

ABP Desam

ఒంగోలులోని ఉలవపాడుకు చెందిన ప్రగతి వయస్సు 46 ఏళ్లు.

ABP Desam

1994లో తమిళంలో విడుదలైన ‘వీట్లా విషేశాంగ’ ప్రగతి తొలి చిత్రం.

పవిత్ర లోకేష్ తరహాలోనే ప్రగతి తండ్రి కూడా ఆమె చిన్నప్పుడే చనిపోయారు.

తల్లి బాధ్యతలను చూసుకుంటూ ప్రగతి.. కార్టూన్‌ చిత్రాలకు డబ్బింగ్ చెప్పేవారు.

ఆ తర్వాత మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనలో నటించారు.

ఆ ప్రకటన చూసి.. దర్శకుడు, నటుడు భాగ్యరాజా తన సినిమాలో ప్రగతికి ఛాన్స్ ఇచ్చారు.

ఏడు తమిళం, ఒక మలయాళీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన తర్వాత ప్రగతి పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత మూడేళ్లు బ్రేక్ తీసుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం సీరియల్స్‌లో నటించారు.

2002లో ‘బాబీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రగతి ఎంట్రీ ఇచ్చారు.

26 ఏళ్ల వయస్సులోనే తన తోటి వయస్సున్న మహేష్ బాబుకు తల్లిలా నటించింది.

ప్రగతి ప్రస్తుతం తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటోంది. ఇదొక్కటే ప్రగతికి, పవిత్రకు మధ్య తేడా!

Image Credit: Pragathi/Instagram