అందం కోసం ఇంత ఖర్చా?



అందంగా ఉంటే సమాజంలో విలువ పెరుగుతుందని అనుకుంటారు చాలా మంది. అందుకే మేకప్ పై శ్రద్ధ పెరిగిపోతోంది.



ఓ సర్వే ప్రకారం ఈ ఏడాది ఆరు నెలల్లోనే కాస్మోటిక్స్ కోసం ఏకంగా అయిదు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారట భారత వనితలు.



కాస్మోటిక్స్ లో ఎక్కువగా లిప్ స్టిక్, నెయిల్ పాలిష్, ఐ లైనర్, ఫౌండేషన్, ఐ లాషెస్ వంటివి అధికంగా కొంటున్నారు.



సర్వేలో భాగంగా పది నగరాల్లోని మహిళలు కొన్న కాస్మోటిక్స్ జాబితాను పరిశీలించారు.



కాస్మోటిక్స్‌ను 40 శాతం మంది మహిళలు ఆన్‌లైన్లోనే కొంటున్నట్టు సర్వే చెబుతోంది.



ఆరు నెలల్లోనే అయిదు వేల కోట్ల రూపాయలు కాస్మోటిక్స్ కోసం ఖర్చు పెట్టినట్టు నివేదిక వివరిస్తోంది.



ఒక్కో భారతీయ మహిళ ఆరు నెలలకు 1200 రూపాయలకు పైగా కాస్మోటిక్స్ కోసం ఖర్చు పెడుతున్నట్టు తేలింది.



భారత్‌లో పని చేసే మహిళల సంఖ్య పెరుగుతుండడం వల్లే కాస్మోటిక్స్ వాడకం పెరుగుతుంది.