2023 ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది.
12 సంవత్సరాల తర్వాత ట్రోఫీని గెలుచుకోవాలన్న భారత జట్టు కల చెదిరింది.
ప్రపంచ కప్‌లో ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ ఫైనల్లో చతికిలబడింది.
కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా సులభంగా విజయం సాధించింది.
241 పరుగులు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
ఓటమి తర్వాత భారత ఆటగాళ్లు కన్నీళ్లలో మునిగిపోయారు.
మహ్మద్ సిరాజ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముగ్గురి కళ్లూ చెమ్మగిల్లాయి.
మొదటి 10 మ్యాచ్‌ల్లో భారత జట్టు అద్భుతంగా ఆడింది.
కానీ ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా గండాన్ని దాటలేకపోయింది.