ముందుగా pmsuryaghar.gov.in పోర్టల్‌లోకి వెళ్లి సైనప్‌ అవ్వాలి.



సైనప్ అవ్వాలంటే మీ పేరు, రాష్ట్రం, విద్యుత్‌ డిస్కమ్‌, విద్యుత్‌ కనెక్షన్‌ కన్జ్యూమర్‌ నంబరు, మొబైల్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ ఇవ్వాలి.



సైనప్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కన్జ్యూమర్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ ఇవ్వాలి.



అక్కడ అప్లై ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి.



ఒకసారి దరఖాస్తు చేసిన తర్వాత అది మీ విద్యుత్‌ డిస్కమ్‌కు వెళ్తుంది



మీ విద్యుత్‌ డిస్కమ్‌ వాళ్లు ఓకే చెబితే సోలార్ ప్యానెల్‌ కొనుగోలు చేసి ఇన్‌స్టాల్‌ చేయాలి.



ఇన్‌స్టలేషన్‌ పూర్తైన తర్వాత ఆ వివరాలను పోర్టల్‌లో ఎంటర్ చేసి నెట్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి.



నెట్‌ మీటర్‌ వచ్చిన తర్వాత డిస్కమ్‌ అధికారులు తనిఖీ చేసి కమిషనింగ్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు.



ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు రాయితీ కోసం అప్లై చేసుకోవాలి



దీని కోసం మీ బ్యాంకు అకౌంట్‌ వివరాలు, క్యాన్సిల్డ్‌ చెక్‌ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.



రాయితీ కోసం అప్లై చేసిన 30 రోజుల్లోపు కేంద్రం నగదును ఖాతాలో వేస్తుంది.