మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్స్ ను కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ప్రారంభించారు.



తొలి వికెట్ కు 63 పరుగులు జోడించారు. 15వ ఓవర్లో రాహుల్.. 21వ ఓవర్లో ధావన్ ఔటయ్యాడు.



తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, గిల్ స్కోరు బోర్డును నడిపించాడు.



కిషన్ 42వ ఓవర్లో సింగిల్ తో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వెంటనే రనౌట్ గా వెనుదిరిగాడు.



వికెట్లు పడుతున్నా గిల్ సమయోచితంగా ఆడుతూ 44వ ఓవర్లో తన తొలి వన్డే సెంచరీని సాధించాడు.



49వ ఓవర్లో 130 పరుగుల వద్ద గిల్ ఔటయ్యాడు. దీంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.



జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 5 వికెట్లు సాధించాడు. విక్టర్, ల్యూక్ చెరో వికెట్ పడగొట్టారు.



290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే త్వరగానే టాప్ ఆర్డర్‌ వికెట్లు కోల్పోయింది.



విలియమ్స్, కెప్టెన్ చకాబ్వాను అక్షర్ పటేల్, టోనీని అవేశ్ ఖాన్, కైతాను కుల్దీప్ ఔట్ చేశాడు.



సెంచరీ చేసిన సికిందర్‌ రజా 49వ శార్దూల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. చివరి ఓవర్లో విక్టర్ బౌల్డ్‌తో ఇన్నింగ్స్‌ ముగిసింది



భారత బౌలర్లలో చాహర్, అవేశ్ ఖాన్, కుల్దీప్, అక్షర్ తలా రెండు వికెట్లు తీశారు.



ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్ రెండు కూడా శుబ్‌మన్‌గిల్