జింబాబ్వేతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా 10 వికెట్లతో విజయం సాధించింది.



దీంతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యం సంపాదించింది.



మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది.



అనంతరం టీమిండియా 30.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 192 పరుగులు చేసి విజయం సాధించింది.



ఓపెనర్లు శిఖర్ ధావన్ (81 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (82 నాటౌట్) రాణించారు.



జింబాబ్వే టాపార్డర్‌ను కుప్పకూల్చిన దీపక్ చాహర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.



జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ రెగిస్ చకాబ్వా (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.



భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసీద్ కృష్ణ, అక్షర్ పటేల్‌లకు మూడేసి, మహ్మద్ సిరాజ్‌కు ఒక్క వికెట్ దక్కింది.



జింబాబ్వే కెప్టెన్ రెగిస్ చకాబ్వా ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్ చేయించినా ఫలితం రాలేదు.



పది వికెట్ల తేడాతో విజయం సాధించిన సందర్భాల్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం.
(All Image Credits: BCCI/ICC)