వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 88 పరుగులతో ఘనవిజయం సాధించింది.



మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.



అనంతరం వెస్టిండీస్ 15.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది.



దీంతో టీమిండియా సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది.



అక్షర్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.



మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అర్ష్‌దీప్ సింగ్ దక్కించుకున్నాడు.



భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (64: 40 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.



వెస్టిండీస్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ మూడు వికెట్లు దక్కించుకోగా... జేసన్ హోల్డర్, డొమినిక్ డ్రేక్స్, హేడెన్ వాల్ష్ తలో వికెట్ పడగొట్టారు.



వెస్టిండీస్ బ్యాటర్లలో షిమ్రన్ హెట్‌మేయర్ (56: 35 బంతుల్లో) మాత్రమే రాణించాడు.



భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లు తీయగా... కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మూడేసి వికెట్లు పడగొట్టారు.