కామన్వెల్త్ గేమ్స్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు రజతంతో ముగించింది.



థ్రిల్లింగ్‌గా సాగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.



ఆఖరి పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.



అనంతరం టీమిండియా 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది.



ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ (61: 41 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.



కెప్టెన్ మెగ్ లానింగ్ (36: 26 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) తనకు సహకారాన్ని అందించింది.



భారత బౌలర్లలో స్నేహ్ రాణా, రేణుకా సింగ్ రెండేసి వికెట్లు తీయగా... దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.



భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్జ్ (33: 33 బంతుల్లో), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (65: 43 బంతుల్లో) రాణించారు.



ఆస్ట్రేలియా బౌలర్లలో యాష్లే గార్డ్‌నర్ మూడు వికెట్లు దక్కించుకుంది.



మెగాన్ షుట్‌కు రెండు వికెట్లు పడ్డాయి. డార్సీ బ్రౌన్, జెస్ జొనాసన్ చెరో వికెట్ తీశారు.