భారత్, పాకిస్తాన్ ఆదివారం ఆసియాకప్‌లో తలపడనున్నాయి.

ఆసియా కప్‌లో ఈ రెండు జట్లూ ఇప్పటివరకు 15 సార్లు తలపడ్డాయి.

8 మ్యాచ్‌ల్లో టీమిండియా, ఐదు సార్లు పాకిస్తాన్ విజయం సాధించాయి.

రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

ఆసియాకప్‌లో పాకిస్తాన్‌‌పై అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ రోహిత్ శర్మ (328).

ఆసియాకప్‌లో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన పాకిస్తాన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ (400).

ఈ టోర్నీలో పాకిస్తాన్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ హార్దిక్ పాండ్యా (మూడు వికెట్లు).

ఈ టోర్నీలో భారత్‌పై అత్యధిక వికెట్లు తీసిన పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ ఆమిర్ (ఎనిమిది వికెట్లు).

2008 తర్వాత ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే టీమిండియాను ఓడించింది.

రేపటి మ్యాచ్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ, పాకిస్తాన్‌కు బాబర్ ఆజమ్ కెప్టెన్సీ వహించనున్నారు.