వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న భారత్ మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లీగ్ దశలోని తొమ్మిది మ్యాచ్‌లను గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో నాకౌట్‌లో అడుగు పెట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ శతకాలు సాధించారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు కొట్టారు. భారత్ చివరి 10 ఓవర్లలో 126 పరుగులు సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకపక్షంగా గెలిచినా నెదర్లాండ్స్ పోరాటం అభిమానులను ఆకట్టుకుంది.