ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 49 పరుగులతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ను కూడా 2-0తో సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. కీలక వికెట్లు త్వరగా కోల్పోయినా జడేజా (46 నాటౌట్: 29 బంతుల్లో, ఐదు ఫోర్లు) చివర్లో బాగా ఆడాడు. ఆరంభంలో రోహిత్ శర్మ (31: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), రిషబ్ పంత్ (26: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడారు. అనంతరం ఇంగ్లండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. మొయిన్ అలీ (35: 21 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), డేవిడ్ విల్లీ (33: 22 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయి ఓటమి పాలైంది.