టీమిండియా వరల్డ్ కప్‌ 2023లో బోణీ కొట్టింది.

తమ మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గమ్యాన్ని చేరుకుంది.

ప్రస్తుతానికి భారత్ వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

కానీ ఎనిమిదికి పైగా ఓవర్లు మిగిలి ఉండగానే గెలవడంతో మంచి నెట్ రన్‌రేట్‌ను సాధించింది.

1999 తర్వాత ఆస్ట్రేలియా ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే మొదటి సారి కావడం విశేషం.

భారత్ తరఫున కేఎల్ రాహుల్ (97 నాటౌట్), విరాట్ కోహ్లీ (85) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (46) అత్యధిక స్కోరు సాధించాడు.

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్ మూడేసి వికెట్లు దక్కించుకున్నారు.