భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ రికార్డులు బద్దలుకొట్టారు. విరాట్ కోహ్లీ (122: 94 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు) వన్డే కెరీర్‌లో 47వ సెంచరీ సాధించాడు. కేఎల్ రాహుల్ (111: 106 బంతుల్లో, 12 ఫోర్లు, రెండు సిక్సర్లు) కమ్‌బ్యాక్ మ్యాచ్‌లోనే శతక్కొట్టాడు. వీరు మూడో వికెట్‌కు అజేయంగా 233 పరుగులు జోడించారు. భారత్ తరఫున మూడో వికెట్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. నంబర్-3,4 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన ఇద్దరూ సెంచరీలు కొట్టడం భారత క్రికెట్ చరిత్రలో ఇది మూడోసారి. ఆసియా కప్‌లో అత్యధిక సెంచరీలు కొట్టిన వారిలో విరాట్ కోహ్లీ (4) రెండో స్థానానికి చేరాడు. సనత్ జయసూర్య (6) మొదటి స్థానంలో ఉన్నాడు. కొలంబో స్టేడియంలో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ సెంచరీలు సాధించాడు. కేవలం 267 ఇన్నింగ్స్‌లోనే విరాట్ కోహ్లీ 13 వేల పరుగులు పూర్తి చేశాడు. వన్డేల్లో ఇదే వేగవంతం.