ప్రధానమంత్రి స్వగ్రామంలో పురాతన కట్టడాలు వెలుగులోకి వచ్చాయి.



పురావస్తు శాఖ నిర్వహించిన సర్వేలో 2800 ఏళ్ల నాటి సాంస్కృతి ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.



గుజరాత్ లోని వాద్ నగర్‌లో ఐఐటీ ఖరగ్ పూర్ బృందం ఏడేళ్లుగా తవ్వకాలు జరుపుతోంది.



క్రీస్తుపూర్వం 800 ప్రాంతంలో ఇక్కడ మానవ నివాసానికి సంబంధించిన అనేక ఆధారాలు లభించాయి



తవ్వకాల్లో ఏడుగురి పాలకుల ఆనవాళ్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.



మౌర్య, ఇండో-గ్రీకు, ఇండో-సిథియన్, హిందూ-సోలంకి, సుల్తాన్‌ నుంచి గైక్వాడ్-బ్రిటీష్ వలస పాలన ఆనవాళ్లు ఉన్నాయి.



ఇండో-గ్రీక్ పాలనలో గ్రీకు రాజు అపోలోడాటస్ నాణేల అచ్చులు కూడా గుర్తించారు.



విలక్షణమైన పురావస్తు కళాఖండాలు, కుండలు, రాగి, బంగారం, వెండి, ఇనుప వస్తువులు, గాజులు కనుగొన్నారు.



అతి పురాతనమైన బౌద్ధ మఠాలు కూడా బయటపడ్డాయి