ఆసియా కప్‌ సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియాపై ఐదు వికెట్లతో పాకిస్తాన్ విజయం సాధించింది.



మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.



అనంతరం పాకిస్తాన్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.



మహ్మద్ నవాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.



భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (60: 44 బంతుల్లో) రాణించాడు.



ఓపెనర్లు రోహిత్ శర్మ (28: 16 బంతుల్లో), కేఎల్ రాహుల్ (28: 20 బంతుల్లో) వేగవంతమైన ప్రారంభాన్ని అందించారు.



వీరి తర్వాత కోహ్లీ మినహా ఎవరూ రాణించలేదు.

పాకిస్తాన్ బ్యాటర్లలో రిజ్వాన్, నవాజ్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.



వీరు అవుట్ కావడంతో భారత్ మ్యాచ్‌లోకి వచ్చింది.



అయితే ఆసిఫ్ అలీ క్యాచ్‌ను అర్ష్‌దీప్ సింగ్‌ను వదిలేయడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్.

భారత్ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.
(All Images Credits: BCCI)