ఆసియాకప్ టోర్నీలో భారత్ ఖాతాలో మరో విజయం పడింది.

బుధవారం హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగులతో విజయం సాధించింది.

దీంతో సూపర్-4కు కూడా అర్హత సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

అనంతరం హాంగ్ కాంగ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

సూర్యకుమార్ యాదవ్‌కు(68 నాటౌట్: 26 బంతుల్లో) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

విరాట్ కోహ్లీ (59 నాటౌట్: ఒక ఫోర్, మూడు సిక్సర్లు) ఫాంలోకి వచ్చాడు.

చివరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ నాలుగు సిక్సర్లతో 26 పరుగులు పిండాడు.

అనంతరం హాంగ్ కాంగ్ ఏ దిశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు.

విరాట్ కోహ్లీ సరదాగా ఒక ఓవర్ బౌలింగ్ వేశాడు.