టీ20ల్లో 50కి పైగా సగటులో 1000 పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీనే. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ 30 అర్థ సెంచరీలు సాధించాడు. ఈ విషయంలో రోహిత్ శర్మతో కలిసి తను అగ్ర స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లో 12 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. ఇది రెండో అత్యధిక రికార్డు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధికంగా ఏడు మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా విరాట్ సొంతం. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 సగటు (108.83) విరాట్ పేరు మీదనే ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ అత్యధికంగా 10 అర్థ సెంచరీలు సాధించాడు. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో ఐదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు విరాట్‌కు దక్కాయి. ఏ ఆటగాడూ ఇన్ని సార్లు దీన్ని సాధించలేకపోయారు. టీ20 వరల్డ్ కప్‌లో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ రికార్డు కూడా ఇంతవరకు చెక్కు చెదరలేదు. పాకిస్తాన్‌తో నేడు జరగబోయే మ్యాచ్ విరాట్‌కు 100వ టీ20 గేమ్. టీమిండియా తరఫున 100 టెస్టులు, 100 వన్డేలు, 100 టీ20లు ఆడిన మొదటి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.